నేడు గురునానక్‌ జయంతి

30 Nov, 2020 14:17 IST|Sakshi

నేడు గురుపూరబ్‌ సిక్కు మతంలో అత్యంత పవిత్రమైన రోజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు, ఇతరులు గురునానక్‌ జయంతిని జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం అక్టోబర్‌, నవంబర్‌ నెలలో గురునానక్‌ జయంతిని పురస్కరించుకుంటారు. ఈరోజు గురుద్వారాలలో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్‌ సాహిబ్‌ను పఠిస్తారు. ఇది 48 గంటలపాటు నిరంతరంగా సాగుతుంది. దీనిని అఖండపఠనం అంటారు. జయంతి నాడు ఉదయాన్నే కీర్తనలతో, ప్రార్థనలు చేస్తూ ఊరేగింపు నిర్వహిస్తారు. చదవండి: (భారత రాజకీయాల్లో లైలా, మజ్నూ..)

గురు గ్రంథసాహిబ్‌ను పల్కిలో చుట్టి, పూలతో అలంకరించి రథంలో తీసుకెళ్తారు. ఈ సంవత్సరం 551 వ గురునానక్‌ జయంతిని జరపుకుంటున్నారు. గురునానక్‌ దేవ్‌జీ కి సబంధించిన ఫోటోలు, సందేశాలు వాట్సాప్‌ , ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో పంచుకుంటున్నారు. ఈ సందర్బంగా మీరు, మీకుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలంటూ సోషల్‌ మీడియా వేదికగా గురునానక్‌ జయంతి  శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు