పంజాబ్‌లోనూ మందిర్‌–మసీదు వివాదం

19 May, 2022 12:08 IST|Sakshi

పటియాలా: మందిర్‌–మసీదు వివాదం పంజాబ్‌నూ తాకింది. పటియాలా సమీపంలో రాజ్‌పురాలోని గుజ్రన్‌వాలా మొహల్లాలో ఉన్న మసీదు నిజానికి సిక్కులకు చెందిన సరాయి అని స్థానిక హిందూ, సిక్కు సమూహాలు బుధవారం ఆరోపించాయి. ‘‘రెండేళ్ల క్రితం అందులో ఉంటున్న రెండు సిక్కు కుటుంబాలను తరిమేసి ఆక్రమించుకున్నారు. సిక్కు మత, ఆరాధన చిహ్నాలను తొలగించారు. గుమ్మటం నిర్మించి ఆకుపచ్చ రంగు వేసి మసీదుగా మార్చారు’’ అని పేర్కొన్నాయి.

దీన్ని ముస్లిం సమూహం ఖండించింది. అది స్వాతంత్య్రానికి ముందునుంచీ మసీదుగానే కొనసాగుతూ వస్తోందని వాదించింది. ఇరు వర్గాలూ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ హిమాన్షు గుప్తాకు ఫిర్యాదు చేశాయి. రెండు రోజుల్లోగా సాక్ష్యాలు సమర్పించాలని వారికి ఆయన సూచించారు. హర్యానా, యూపీకి చెందిన వాళ్లు ఇబ్బంది పెడుతున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో కట్టడం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
చదవండి: Assam Floods: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి

మరిన్ని వార్తలు