వారణాసిలోనే జ్ఞానవాపి కేసు..ఆ వ్యాజ్యం చెల్లుతుంది.

31 May, 2023 18:14 IST|Sakshi

జ్ఞానవాపి కేసులో ముస్లీం కమిటికి చుక్కెదురైంది. మసీదు కమిటీ హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోరుతూ చేసిన అ‍భ్యర్థనను బుధవారం అలహాబాద్‌ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో హిందూ మహిళలు వేసిన వ్యాజ్యం చెల్లుబాటవుతుందని అనూహ్యమైన తీర్పు ఇచ్చింది కోర్టు. అలాగే స్థానిక వారణాసిలోనే కేసు కొనసాగేలా అనుమతిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో హిందు మహిళల బృందానికి భారీ ఊరట లభించినట్లయ్యింది. 

వారణాసిలో జ్ఙానవాపి మసీదులో పూజలు చేసుకునే హక్కును కోరుతూ హిందూ మహిళల బృందం లక్ష్మీ దేవి, రేఖా పాఠక్, సీతా సాహు, మంజు వ్యాస్  అలహాబాద్‌ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ కేసు తెరపైకి వచ్చి గణనీయమైన వివాదాస్పదానికి దారితీసింది. ఈ వివాదం ఏప్రిల్‌ 2021 నుంచి కోర్టులోనే ఉంది. వారణాసి జిల్లా న్యాయమూర్తి ఈ కేసు నిర్వహణను సమర్థించారు. 

ఇదిలా ఉండగా, అంజుమన్‌ ఇంతేజామియా మసీదు(ఏఐఎం) కమిటీ, ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌ 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం, 1995 సెంట్రల్‌ వక్ఫ్‌ చట్టం ప్రకారం ఈ కేసును నిర్వహించడం సాధ్యం కాదని వాదిస్తూ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. వాదనలు విన్న అలహాబాద్‌ హైకోర్టు డిసెంబర్‌ 23, 2022న తన నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసింది. కాగా, హిందూ మహిళల పిటిషన్‌పై వారణాసి కోర్టు మసీదు సముదాయంపై సమగ్ర సర్వే నిర్వహించాలని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించింది కూడా.

(చదవండి: Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో తొందరపాటు వద్దు.. సైంటిఫిక్‌ సర్వేపై సుప్రీం కోర్టు స్టే))

మరిన్ని వార్తలు