ఐఎంఏ స్కాం‌లో చేతులు కాల్చుకున్న సంజన!

30 Sep, 2020 20:24 IST|Sakshi

శాండల్‌వుడ్‌ డ్రగ్‌ స్కాండల్‌

బెంగళూర్‌ : డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన కన్నడ హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిల విచారణలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ఏడాది బయటపడిన ఐఎంఏ స్కామ్‌లో ఐఎంఏ, దాని అనుబంధ కంపెనీలు అధిక రాబడి ఆశ చూపుతూ ఇన్వెస్టర్లను నిండా ముంచాయి. శాండల్‌వుడ్‌ డ్రగ్‌ కుంభకోణంలో ఇప్పుడు ఐఎంఏ నిర్వాకం వెలుగులోకి వస్తోంది. సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలతో పాటు కస్టడీలో ఉన్న ఇతరుల ఆస్తులు, పెట్టుబడులపై ఆరా తీస్తున్న సీసీబీ, ఈడీలు పలు విషయాలను రాబట్టాయి. ఐఎంఏ స్కీమ్‌లో తాను భారీగా వెచ్చించి నష్టపోయానని విచారణ సందర్భంగా సంజనా వెల్లడించినట్టు తెలిసింది. చదవండి : డ్రగ్స్‌ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు! 

పెట్టుబడిపై వేగంగా మెరుగైన రిటన్స్‌ రాబట్టుకోవచ్చని తాను ఆ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టగా ఐఎంఏ అవకతవకలతో లక్షల రూపాయల మొత్తాన్ని పోగొట్టుకున్నానని ఆమె దర్యాప్తు అధికారులకు వివరించినట్టు సమాచారం. సంజనా, రాగిణిలు హవాలా లావాదేవీలకు పాల్పడ్డారనే అనుమానంతో వీరిద్దరినీ ప్రస్తుతం సీసీబీ అధికారులు విచారిస్తున్నారు. కస్టడీలో ఉన్న మరో నిందితుని సమాచారంతో ఈ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు సంజనా, రాగిణి బెయిల్‌ పిటిషన్‌ను ఎన్డీపీఎస్‌ ప్రత్యేక న్యాయస్ధానం తోసిపుచ్చింది. వారికి బెయిల్‌ కోసం లాయర్లు హైకోర్టును సంప్రదించాలని యోచిస్తున్నట్టు సమాచారం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా