హర‍్భజన్‌ సింగ్‌ కీలక నిర్ణయం.. దేశ పాలిటిక్స్‌లో సంచలనం

16 Apr, 2022 14:32 IST|Sakshi

ఛండీగఢ్‌: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ నుంచి వచ్చే జీతాన్ని రైతుల పిల్లల చదువులు, వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తా అంటూ శనివారం ప్రకటించాడు. దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు భజ్జీ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. దేశంలో ఏదైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. జై హింద్‌ అంటూ భజ్జీ వ్యాఖ‍్యలు చేశాడు. 


ఇదిలా ఉండగా.. పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం పంజాబీలకు శనివారం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. జూలై 1వ తేదీ నుంచి పంజాబ్‌లోని ప్రతీ ఇంటికి 300 యూనిట్ల వరకు కరెంట్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పంజాబ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం.. నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ ప్రకటన చేసింది. అయితే ఢిల్లీలోని కేజ్రీవాల్‌ సర్కార్‌ కూడా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ అందిస్తోంది. 

మరిన్ని వార్తలు