Afghanistan-CAA: అఫ్గాన్‌ నుంచి భారత్‌లోకి ఎంట్రీ.. తెరపైకి సీఏఏ

22 Aug, 2021 19:13 IST|Sakshi

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌ సంక్షోభంతో వివాదాస్పద సీఏఏ బిల్లు మరోసారి చర్చకు వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం ఎంత అవసరమో అఫ్గాన్‌లో తలెత్తిన పరిస్థితులు తెలియస్తున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ వ్యాఖ్యానించారు. అల్లకల్లోల అఫ్గాన్‌లో సిక్కులు, హిందువులు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.

చదవండి: Elon Musk Tweet On Taliban: తాలిబన్లను ప్రశ్నించిన ఎలన్‌ మస్క్‌, వైరల్‌

కాగా, అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులను కాపాడాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏసీ-17 విమానం ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో 168 మందితో ఘజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌కు చేరింది.

వీరిలో  107 మంది భారతీయులు.. 20 మంది అఫ్గాన్‌ హిందువులు, సిక్కులు ఉన్నారు. ఇక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విమానం లోపల 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేసిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అది ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

కాగా పౌరసత్వ సవరణ చట్టం అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు,  క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించినది. కాగా 2019 డిసెంబర్‌లో భారత్‌లో కొత్త పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే భారత పొరుగు దేశాలకు చెందిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన చట్టమని సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ దేశంలో తీవ్ర ఆందోళనలు కొనసాగాయి.
 


చదవండి: Afghanistan: 20 ఏళ్ల కష్టం పోయింది.. మిగిలింది సున్నా.. అఫ్గాన్‌ ఎంపీ కన్నీటి పర్యంతం

మరిన్ని వార్తలు