ఆఫీస్‌కు రమ్మని చెప్పేది ఇందుకే: హర్ష గోయెంకా వైరల్‌ ట్వీట్‌

30 Sep, 2022 13:34 IST|Sakshi

వర్క్‌ ఫ్రం హోమ్‌.. కరోనా సమయంలో బాగా వినిపించిన పేరు. కోవిడ్‌ వచ్చాక దాదాపు ప్రతి కంపెనీ కార్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఇటీవల కోవిడ్‌ కేసులు తగ్గిపోవడంతో మళ్లీ కార్యాలయాలు తెరుచుకున్నాయి. మెల్లమెల్లగా ఉద్యోగులు కంపెనీల బాట పడుతున్నారు. కానీ కొంతమంది ఇంకా ఇంటి నుంచే పని చేయడానికి ఇష్టపడుతున్నారు. సుమారు ఏడాది, రెండేళ్లపాటు ఇంట్లో ఉండటంతో చాలామంది వర్క్‌ ఫ్రం హోంకు అలవాటు పడిపోయారు.  

ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా తాజాగా వర్క్‌ ఫ్రం హోం, వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ గురించి తెలుపుతూ ఓ ట్వీట్‌ చేశారు. ఇంటి నుంచి కంటే ఆఫీస్‌ నుంచి పనిచేయడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. పోస్టులో రెండు పై చార్ట్‌లు ఉండగా.. పై దానిలో వర్క్‌ ఫ్రం హోమ్‌కు సంబంధించింది. ఇందులో మొత్తం పని కోసమే కేటాయించి ఉంది.
చదవండి: ఆఫీస్‌ నుంచి వర్క్‌ చేయాలనేది ఇందుకే: హర్ష గోయెంకా వైరల్‌ ట్వీట్‌

ఇక రెండో చార్ట్‌ వర్క్‌ ఫ్రం ఆఫీస్‌కు సంబంధించింది. ఇందులో వర్క్‌తో పాటు మిగతా పనులకు కూడా అవకాశం ఉంది. టీ, లంచ్‌ బ్రేక్‌ తీసుకోవడం, ట్రాఫిక్‌లో ఉండటం. మన పని చేసుకోవడంతోపాటు ఇతరులకు సాయపడటం వంటివి కూడా ఉన్నాయి. ఈ కారణాలతోనే ఆఫీస్‌ నుంచి వర్క్‌ చేయాలనేది’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వర్క్‌ ఫ్రం హోం, వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ వల్ల కలిగే అసలైన ప్రయోజనాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఆఫీస్‌ వాతావరణం ఉద్యోగి, కంపెనీకి ఇద్దరికీ అనకూలమైనదని హర్ష గోయంకాకు కొందరు మద్దతిస్తున్నారు

మరిన్ని వార్తలు