హర్ష్‌ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు

31 Aug, 2021 18:03 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫన్నీ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.  2014 వింబుల్డన్ లేడీస్ డబుల్స్‌ మ్యాచ్‌ సందర్భంగా అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను గోయెంకా ట్విటర్‌లో రీట్వీట్‌ చేశారు. ఈ మిలియన్ డాలర్ల వీడియో నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది.

2014లో జరిగిన వింబుల్డన్ మహిళల డబుల్స్ మొదటి రౌండ్ మ్యాచ్ మ్యాచ్‌లో టెన్నిస్ స్టార్లు సెరెనా, వీనస్ విలియమ్స్ ఒక్సానా కలష్నికోవా, ఓల్గా సావ్‌చుక్‌తో పోటీపడ్డారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి సర్వీస్‌ను ఎదుర్కొనే క్రమంలో వీనస్ వాలీ షాట్‌ను సెరెనా బ్యాలెన్స్‌ చేస్తూ బేస్‌లైన్‌పై పరుగెత్తుతూ పక్కనే ఉన్న ప్రేక్షకులపై పడపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే  ప్రేక్షకులలో ఒకరు ఆమెను పట్టుకున్నారు. ఈ ఘటన అక్కడున్నవారిలో నవ్వులు పూయించింది. అంతేకాదు ‘వావ్‌.. వాట్‌ ఏ లక్కీమాన్‌’అంటూ చమత్కరిస్తు‍న్నారు. అతని టిక్కెట్ ధరకి చాలా విలువ వచ్చింది ఇలాంటి అదృష్టం లక్షల్లో ఒకరికే అంటూ అసూయపడుతున్నారు. కాగా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే గోయెంకా తరచుగా అనేక విషయాలపై స్పందిస్తూ పలు వీడియోలు షేర్‌ చేస్తూ సందడి చేయడం తెలిసిందే. తాజాగా ఆయన మరో ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

చదవండి : Zomato: యాడ్‌ల దుమారం, మండిపడుతున్న నెటిజనులు

మరిన్ని వార్తలు