మరణాలపై చర్చ వృథా.. బతికున్నవారిని కాపాడటమే కీలకం! 

28 Apr, 2021 13:13 IST|Sakshi

హరియాణా సీఎం ఖట్టర్‌ 

రోహతక్‌: కరోనా కారణంగా జరిగిన మరణాల సంఖ్యపై చర్చోపచర్చలతో వారిని తిరిగి బతికించలేమని, దానికి బదులు ప్రస్తుతం బతికిఉండి బాధపడుతున్నవారిని పట్టించుకోవడంపై శ్రద్ధ పెట్టాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలకు, వాస్తవ మరణాల లెక్కలకు పొంతన కుదరడంలేదన్న విమర్శలపై ఆయన స్పందించారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో మరణాల డేటా పట్టుకొని వాదోపవాదాలు చేయవద్దని, బతికిఉన్నవారిని కాపాడడం, వారికి స్వాంతన చేకూర్చడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ మండిపడింది. దయలేని పాలకులే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని, సంభవించిన ప్రతిమరణం ప్రభుత్వ అసమర్ధత వల్లనే జరిగిందని కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా విమర్శించారు. రాష్ట్రంలోని నగరాల్లో ఆక్సిజన్‌ సరఫరాను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి పర్యటించారు. ఎవరూ ఇలాంటి సంక్షోభాన్ని ఊహించలేదని, దీన్ని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేయడమే మార్గమన్నారు. ఈ సమయంలో అనవసర వివాదాలకు తావివ్వవద్దన్నారు. మెడికల్‌ ఆక్సిజన్‌ కొరతతో ఆస్పత్రుల్లో  మరణాలపై విచారణకు ఆదేశించారు.

చదవండి: ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లకు ఎందుకంత డిమాండ్‌? 

మరిన్ని వార్తలు