ప్రింటింగ్‌ ప్రెస్‌ ఓనర్‌.. రోడ్డు పక్కన కర్రీస్‌ అమ్ముతూ ప్రత్యక్షం.. అసలేం జరిగింది!

31 Mar, 2023 15:37 IST|Sakshi

కోవిడ్ మహమ్మారి దెబ్బకు లాక్‌డౌన్‌ విధించడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయినప్పటికీ కోట్లలో ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ వైరస్‌ దాదాపు ప్రతి ఒక్కరి జీవితాలను మార్చేసిందనే చెప్పాలి. దీని ప్రభావంతో కొందరికి ఉద్యోగాలు కోల్పోగా.. మరికొన్ని సంస్థలు నష్టాల బాటలో నడవడంతో వ్యాపారాలను బంద్‌ చేయాల్సి వచ్చింది. ఇదే తరహాలో,  గతంలో ప్రింటింగ్ ప్రెస్‌కు యజమానులుగా ఉన్న ఓ జంట లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఈ ఫోటోను ఫుడ్ బ్లాగర్ జతిన్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఉద్యోగం కన్నా వ్యాపారమే మిన్న
ఓ జంట ఫరీదాబాద్‌లోని గేట్ నంబర్ 5 సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ కాలనీలో ఉన్న వారి స్టాల్‌లో నిలబడి కర్రీస్‌ అమ్ముతూ ఉంటారు. ఇంతలో ఓ వ్యక్తి ఆ జంట దగ్గరకీ వెళ్లి చూడగా వారిద్దరూ గతంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులు. షాకైన ఆ వ్యక్తి ఆ జంటను ఏం జరిగిందని అడగగా ఈ మేరకు సమాధానం వచ్చింది. "నేను ప్రింటింగ్ ప్రెస్‌ని నడిపేవాడిని, కానీ లాక్‌డౌన్ కారణంగా వ్యాపారం జరగలేదు. దీంతో ఆర్థికంగా చాలా వరకు నష్టపోయాను. రాను రాను ప్రెస్‌ నష్టాలు పెరుగుతూ పోయింది.

దీంతో చేసేదేమి లేక ప్రెస్‌ను మూసేశాను. ఆ తర్వాత బతుకు బండి నడిపేందుకు కొంతకాలం ఉద్యోగం చేసాను. అయితే మా రోజువారీ ఖర్చులకు అవసరమైన డబ్బు ఉద్యోగం ద్వారా సంపాదించే జీతంతో సరిపోయేవి కావు. దీంతో ఉద్యోగం వదిలేసి ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకున్నాను. నాకు, నా భార్యకు వంట చేయడం బాగా తెలుసు, అందుకే ఈ పుడ్‌ స్టాల్‌ పెట్టుకున్నాని తెలిపారు. ప్రస్తుతం వీరి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారి చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ జంటను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
 

A post shared by Jatin singh (@foody_jsv)

మరిన్ని వార్తలు