ఓం ప్ర‌కాశ్ చౌతాలా: మరో కేసులో దోషిగా మాజీ సీఎం.. పదేళ్ల శిక్ష తర్వాత మళ్లీ..

21 May, 2022 21:29 IST|Sakshi

ఢిల్లీ: హ‌ర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్ర‌కాశ్ చౌతాలా మ‌రో కేసులో దోషిగా తేలారు. టీచ‌ర్ల కుంభ‌కోణంలో ఆయన దోషిగా నిరూపితమై, ప‌దేళ్ల పాటు జైలు జీవితం గ‌డిపిన సంగ‌తి తెలిసిందే ఉంటుంది. పైగా జైలు శిక్ష పూర్తి చేసుకుని గ‌తేడాది జులైలో ఆయ‌న విడుద‌ల‌య్యారు.

తాజా కేసు విష‌యానికి వ‌స్తే.. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగిన ఆరోప‌ణ‌ల‌పై చౌతాలాపై గ‌తంలోనే కేసు న‌మోదు అయ్యింది. ఈ కేసు విచార‌ణ‌ను చేప‌ట్టిన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు శ‌నివారం చౌతాలాను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయ‌న‌కు ఏ త‌ర‌హా శిక్ష విధించాల‌న్న విష‌యంపై కోర్టు ఈ నెల 26న చేప‌ట్ట‌నున్న విచార‌ణ‌లో నిర్ణ‌యం తీసుకోనుంది.

ప‌దేళ్ల జైలు శిక్ష అనుభ‌వించి వ‌చ్చి ఏడాది కాక‌ముందే మ‌రో కేసులో దోషిగా తేలిన 87 ఏళ్ల చౌతాలాకు..  ఈ సారి ఏ త‌ర‌హా శిక్ష ప‌డుతుంద‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

మరిన్ని వార్తలు