కరోనా కట్టడికి హరియాణ కఠిన నిర్ణయం

21 Aug, 2020 18:39 IST|Sakshi

రికార్డు కేసులతో అప్రమత్తం

గురుగ్రాం : కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు హరియాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇక ప్రతి శని, ఆదివారాల్లో నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు మినహా అన్ని షాపులు, కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల నుంచి నిత్యావసరాలను విక్రయించే దుకాణాలను మినహాయించామని హరియాణ ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌ స్పష్టం చేశారు. హరియాణలో గురువారం అత్యధికంగా 996 కరోనా వైరస్‌ కేసులు వెలుగుచూడటంతో ప్రభుత్వం వారాంతాల్లో లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుంది.

ఇక హరియాణలో ఇప్పటివరకూ 50926 కోవిడ్‌-19 కేసులు నమోదవగా, మహమ్మారి బారినపడి 578 మంది మరణించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. హరియాణలో మొత్తం యాక్టివ్‌ కేసులు 7555 కాగా, 42,793 మంది రోగులు వ్యాధి నుంచి కోలుకుని ఆ​స్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కోవిడ్‌-19 రికవరీ రేటు 84.03 శాతం కాగా మరణాల రేటు 1.13 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. చదవండి : పంజాబ్‌: కొత్త లాక్‌డౌన్‌ నిబంధనలు

మరిన్ని వార్తలు