బీబీసీపై రూ.10 వేల కోట్ల పరువు నష్టం కేసు

23 May, 2023 05:52 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ పేరుతో డాక్యుమెంట్‌ రూపొందించిన బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ)పై ఓ ప్రభుత్వేతర సంస్థ ఢిల్లీ హైకోర్టులో రూ.10 వేల కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ డాక్యుమెంట్‌లో ప్రధాని మోదీ, భారత న్యాయవ్యవస్థపై తప్పుడు ఆరోపణలతో బీబీసీ భారత ప్రభుత్వం, గుజరాత్‌ ప్రభుత్వాల ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపించింది.

గుజరాత్‌కు చెందిన జస్టిస్‌ ఆన్‌ ట్రయల్‌ అనే సంస్థ వేసిన పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. బీబీసీ (యూకే)తోపాటు బీబీసీ(ఇండియా)కు సమన్లు ఇచ్చింది. సెప్టెంబర్‌ 25న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. పిటిషన్‌దారు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించారు. నష్ట పరిహారంతోపాటు తమ సంస్థకు ఇతర ఆదాయ మార్గాలు లేనందున కోర్టు ఫీజులు తదితరాల కోసం రూ.10 వేల కోట్లు చెల్లించాలని కోరారు.

మరిన్ని వార్తలు