దేశ రాజధానిలో కొత్తగా 4,127 కరోనా కేసులు

18 Sep, 2020 21:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 38 వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,127 కరోనా కేసులు నమోదు ​కాగా.. డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 3,568 కాగా 30 మంది కరనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటిక వరకు దేశ రాజధానిలో నమోదైన కేసుల సంఖ్య 2,38,828లకు చేరుకోగా.. మృతి చెందిన వారి సంఖ్య 4,907గా ఉంది. కోవిడ్‌ చికిత్స పూర్తి చేసుకుని 2,01,671 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.  దీంతో ప్రస్తుతం ఢిల్లీ యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,250 కాగా.. ఇవాళ 11,203  మంది ఆర్‌టీపీసీఆర్‌‌ పరీక్షలు, 49, 834 మంది ర్యాపిడ్‌ టెస్టులు జరిపారు. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీలో నిర్వహించిన కరోనా పరీక్షల కేసుల సంఖ్య 24,30,629గా ఉంది. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి  సంఖ్య 18,701. కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 1751గా ఉంది.
(చదవండి: కరోనా నిర్ధారణకు మరో కొత్త పరికరం)

ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్ల సంఖ్య14,974, ప్రతి మిలియన్ జనాభాలో 1,27,927 మందిక కరోనా పరీక్షలు జరిగాయి. ఈ మేరకు ఢిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.కాగా దేశంలో గడిచిన 24 గంటల్లో మొత్తం 96,424 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వైరస్‌ బారినపడి 1174 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,14,678 చేరగా.. మృతుల సంఖ్య 84372కి పెరిగింది. ఇప్పటివరకు కోలుకుని 41,12,552 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 10,17,754 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు