85 రోజుల్లో 10,12,84,282 డోసులు

11 Apr, 2021 06:02 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి  హర్షవర్దన్‌ చెప్పారు. దేశంలో కేవలం 85 రోజుల్లో 10 కోట్ల కరోనా టీకా డోసులు ఇచ్చామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా టీకాలు ఇస్తున్న దేశాల జాబితాలో భారత్‌ చేరిందన్నారు. 10 కోట్ల డోసులు ఇవ్వడానికి యూకేలో 89 రోజులు, చైనాలో 102 రోజులు పట్టిందని గుర్తుచేశారు.  ఇండియాలో ప్రస్తుతం రోజువారీగా సగటున 38,93,288 డోసులను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల వరకూ దేశంలో 10,12,84,282 డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు