గర్భిణులకు వ్యాక్సినేషన్‌పై గైడ్‌లైన్స్‌ 

30 Jun, 2021 08:24 IST|Sakshi

న్యూఢిల్లీ: గర్భిణులు టీకాలు వేయించుకోవడంపై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. టీకా వల్ల ప్రయోజనాలు వివరించడంతో పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గర్భిణులకు వివరించాలంటూ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు గైడ్‌లైన్స్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ తయారు చేసింది. గర్భిణుల్లో 90 శాతంమందికి కోవిడ్‌ సోకినా ఆస్పత్రి పాలుకాకుండానే నయమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని కేసుల్లో మాత్రం ఒక్కమారుగా ఆరోగ్యం క్షీణించడం, పిండంపై ప్రభావం చూపడం వంటి దుష్పరిణామాలున్నాయని కేంద్రం తెలిపింది.

అందువల్ల వీరు సైతం కరోనా టీకా తీసుకోవాలని సూచించింది. గర్భం వల్ల కరోనా రిస్కు పెరగదని స్పష్టం చేసింది. గర్భందాల్చిన వారిలో 35ఏళ్ల పైబడినవారు, బీపీ, ఒబేసిటీ వంటి సమస్యలున్నవారికి కరోనా వల్ల రిస్కు అధికమని తెలిపింది. కోవిడ్‌ సోకిన స్త్రీలకు జన్మించిన 95 శాతం మంది  శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. ప్రసవానికి ముందు కోవిడ్‌ సోకినట్లయితే ప్రసవానంతరం తొందరగా టీకా తీసుకోవాలని సూచించింది.

చదవండి:
కరోనా వ్యాక్సిన్‌ బదులు కుక్క కాటు టీకా
Covid 19 థర్డ్‌ వేవ్‌ ప్రిపరేషన్‌: కేంద్రం కీలక నిర్ణయం     

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు