కరోనా పేషెంట్‌ మృతి.. హెల్త్‌ వర్కర్లపై దాడి

6 Jun, 2021 16:44 IST|Sakshi

ఇంఫాల్‌: కరోనా మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న హెల్త్‌ వర్కర్లపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. మొన్న అస్సాంలో హెల్త్‌ వర్కర్లపై దాడి ఘటన మరువకముందే తాజాగా మణిపూర్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(జెన్‌ఐఎమ్‌ఎస్‌)లో కరోనా పేషెంట్‌ బంధువులు  హెల్త్‌ వర్కర్లపై దాడికి దిగారు. దీంతో పాటు ఐసీయూ వార్డులోనూ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ను నాశనం చేశారు. ఇవన్నీ అక్కడి ఆసుపత్రి సీసీటీవీలో రికార్డు అయ్యాయి. కాగా 33 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఆదివారం కన్నుమూయడంతో ఆమె బంధువులు ఆగ్రహంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సమాచారం.


ఆసుపత్రి వర్గాలు అందించిన సమాచారం మేరకు.. మూడ్రోజుల క్రితం కరోనాతో సదరు మహిళ మా ఆసుపత్రిలో చేరింది. అప్పటికే ఆమెకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో ఐసీయూకు షిఫ్ట్‌ చేయాలని మహిళ బంధువులకు ఆసుపత్రి వర్గం తెలిపింది. కానీ వారు అందుకు ఒప్పుకోలేదు.. అయితే ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో ఐసీయూలోకి షిఫ్ట్‌ చేసిన కాసేపటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రికి వచ్చి హెల్త్‌ వర్కర్లపై దాడికి దిగారు. అంతేగాకుండా ఐసీయూలోని మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ను నాశనం చేశారు.

కాగా హెల్త్‌ వర్కర్లపై దాడిని జెన్‌ఐఎమ్‌ఎస్‌ మెడికల్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ కేహెచ్‌ లోకేశ్వర్‌సింగ్‌ ఖండించారు. కరోనా మహమ్మారి కష్టకాలంలో పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం అవమానీయం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అని పేర్కొన్నారు.  

చదవండి: డాక్టర్‌పై భయానక దాడి.. వెంటాడి.. వేటాడి

మరిన్ని వార్తలు