Raj Kumar Family: రాజ్‌ కుటుంబాన్ని వెంటాడుతున్న గుండె జబ్బులు

10 Sep, 2022 08:02 IST|Sakshi

మైసూరు: కన్నడ కంఠీరవ డాక్టర్‌ రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులందరికీ గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, బెంగళూరు జయదేవ హృద్రోగ, పరిశోధన సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌. సీఎస్‌. మంజునాథ్‌ తెలిపారు. శుక్రవారం మైసూరు నగరంలో ఆయన గుండెకు సంబంధించిన సమస్యలపై మీడియాతో మాట్లాడారు.

పునీత్‌రాజ్‌కుమార్, అతని సోదరులు రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్‌ ఇద్దరికీ కూడా గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని, అది వారికి వంశపారం పర్యంగా ఉందన్నారు. ఆ సమస్యతోనే ఇటీవల పవర్‌స్టార్‌ పునీత్‌ గుండెపోటుతో మృతి చెందారని గుర్తు చేశారు.

బెంగళూరు నగరంలో మరో వారం రోజుల్లో జయదేవ హృద్రోగ సంస్థ మరో యూనిట్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. మైసూరు జయదేవలో ప్రతి నెల 1000 మందికి ఆంజియోగ్రామ్‌ చికిత్స చేస్తున్నామని, అదే విధంగా నెలరోజుల వ్యవధిలో హుబ్లీలో ఓ ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు.   

చదవండి: (‘ఆ అమ్మాయి నా కూతురే కాదు’) 

మరిన్ని వార్తలు