అమానవీయం: సైకిల్‌పై భార్య మృతదేహం తరలింపు

28 Apr, 2021 17:43 IST|Sakshi

లక్నో: కరోనా విజృంభణ వేళ దేశంలో అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయి. కరోనాకు భయపడి ప్రజలు అందరినీ అనుమానిస్తున్నారు. కరోనా భయంతో చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలోనే మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించిన తన భార్యను సైకిల్‌పై శ్మశానానికి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోకి అతడిని రాకుండా నిలువరించారు.

ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌ జిల్లా అంబర్‌పూర్‌కు చెందిన తిలక్‌ధారి సింగ్‌ భార్య రాజ్‌కుమారి (50) అనారోగ్యంతో ఉమానాథ్‌ జిల్లా ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతిచెందింది. గ్రామం వరకు అంబులెన్స్‌లో మృతదేహం చేరింది. అయితే అక్కడి నుంచి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాలేదు. నా అనేవారు లేకపోవడంతో అతడు తన భార్యను అంత్యక్రియల కోసం శ్మశానానికి సైకిల్‌పై తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు. ఆమె కరోనాతో మృతి చెందిందనే భయాందోళనతో గ్రామస్తులు ముందుకు కదలనీవలేదు. చివరకు పోలీసుల సహాయంతో అతడు తన భార్య అంత్యక్రియలు నిర్వహించాడు.

చదవండి: కరోనాతో ఒకేరోజు ముగ్గురు ప్రముఖులు కన్నుమూత
చదవండి: ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం 24 గంటల్లో 1,500 కి.మీ జర్నీ
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు