Tamilnadu: భారీ వర్షాలు: 15 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌..

10 Nov, 2021 11:50 IST|Sakshi

చెన్నై(తమిళనాడు): తమిళనాడును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే.. అల్పపీడనం ప్రభావంతో చెన్నై లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రాష్ట్రప్రభుత్వం.. చెన్నై తో పాటు 15 జిల్లాల్లో రెడ్ అలెర్ట్‌ ను ప్రకటించింది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్ పట్టు, విల్లుపురం జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుకోట్టై, తిరువారురు,తేన్ కాశీ, తిరు నల్వేలి, కన్యాకుమారి, మధురై, రామనాధపురం, శివ గంగై జిల్లాలో వర్షం ముప్పు పొంచిఉన్నట్లు వాతావరణ అధికారులు పేర్కొన్నారు.

దీంతో.. చెన్నై నగరంలో మూడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా 12 జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అదే విధంగా..  కన్యాకుమారి,  చెన్నై ప్రాంతాలలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. భారీ వర్షాలకు కావేరి నది, వైగై,   థెన్- పెన్నై, భవానీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు