ముంబైని ముంచెత్తింది

24 Sep, 2020 07:16 IST|Sakshi
ముంబైలో జలమయమైన రహదారి

సాక్షి ముంబై: ముంబైలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. సెప్టెంబర్‌ నెలలో ఇంతటి స్థాయిలో వర్షాలు కురవడం గత 26 ఏళ్లలో ఇది నాల్గోసారి. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు ఏకంగా 286.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1994 ఏడాది తర్వాత సెప్టెంబర్‌ నెలలో కురిసిన భారీ వర్షమిదే. 1974 నుంచి 2020 కాలంలో సెప్టెంబర్‌లో ఇంత భారీ వర్షం నమోదు కావడం ఇది నాల్గోసారి. భారతీయ వాతావరణ శాఖ లెక్కలనుసారం 15.6 మిల్లీమీటర్ల నుంచి 64.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే సాధారణ వర్షంగా భావిస్తారు. 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్లు.. ఆపై వర్షపాతం నమోదైతే అతి భారీ వర్షపాతంగా పేర్కొంటారు.
 

మరిన్ని వార్తలు