Red Alert Issued: వర్ష బీభత్సంతో ఐదుగురు మృతి.. ఆరు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌

16 Oct, 2021 20:59 IST|Sakshi

తిరువనంతపురం: అరేబియా సముద్రంతో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజా జీవనం స్తంభించిపోయింది. నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆర్మీ, వాయుసేన బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సూచించారు.
(చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వాన.. చెరువులైన లోతట్టు ప్రాంతాలు)

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పట్నంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కాడ్  జిల్లాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో ఆరు జిల్లాలైన తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, మలప్పురం, కోజికోడ్, వయనాడ్‌లో ఆరెంజ్‌ అలర్ట్‌, మరో రెండు జిల్లాల్లో యెల్లో అలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్రంలో వరదల ఉధృతికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, కడపటి వార్తలు అందేసరికి కేరళను వణికిస్తున్న వర్షాలు, వరదలతో కనీసం ఐదుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. కొట్టాయం జిల్లాలో 12 మంది వరకు గల్లంతయ్యారు.

(చదవండి: IPL 2021: ధోని ఫ్యాన్స్‌కు మరో గుడ్‌ న్యూస్‌.. ఫ్యామిలీలోకి మరొకరు?)

కొట్టాయంలో వరదలో కొట్టుకుపోతున్న కారును  ఒడ్డుకు తెస్తున్న దృశ్యాలు

కొట్టాయంలోని పూజ్‌నగర్‌లో ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీబస్సు వరదల్లో చిక్కుకుంది. అధికారులు హుటాహుటిన స్పందించి ప్రయాణికులందరినీ ఒడ్డుకు చేర్చడంతో ప్రమాదం తప్పింది.

మరిన్ని వార్తలు