ముంబైలో భారీ వర్షాలు..సోషల్‌ మీడియాను ముంచెత్తుతున్న మీమ్స్‌..

9 Jun, 2021 18:55 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో రుతుపవనాల రాకతో ముంబై నగరంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై నగరంలో నిన్నటి నుంచి ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. కాగా ఈ నెల 9 నుంచి 13 వరకు ముంబైతో పాటు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. మరోవైపు తొలకరి జల్లులను ముంబై వాసులు ఎంజాయ్‌ చేస్తున్నారు.  ముంబై వర్షాలపై నెటిజన్లు మీమ్స్‌తో సోషల్‌ మీడియాను ముంచెత్తుతున్నారు.

ముంబైలో వర్షం ఒక గంటపాటు పడితే ఒకే గానీ..ఏకధాటిగా కురిస్తే మాత్రం అంతే సంగతులు..! అంటూ ఓ నెటిజన్‌ సోషల్‌ మీడియాలో వీడియోను పోస్ట్‌ చేశాడు. మరో నెటిజన్‌ ముంబై స్టైల్‌ క్రికెట్‌ అంటూ వర్షంలో క్రికెట్‌ ఆడుతున్న వీడియోను షేర్‌ చేశాడు. నగరంలో పడుతున్న భారీ వర్షాలకు ముంబైలో వాటర్‌ పార్క్‌లు వెలిశాయని ఓ నెటిజన్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. 

మరో నెటిజన్‌ అబ్బా..! ఈ సారి వాతావరణశాఖ వర్షాలపై ఇచ్చిన అంచనా నిజమైందని తెలిపాడు. ప్రస్తుతం ట్విటర్‌లో #Mumbairains ట్రెండింగ్‌లో ఉంది. దాంతో పాటుగా బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధవన్‌ ట్విటర్‌లో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ వర్షంలో ఫోటో దిగుతూ ఫోజ్‌ ఇచ్చాడు.

చదవండి: ఎంత పని చేశావమ్మా... ఏనుగు!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు