Viral: బరువులెత్తుతూ కుప్పకూలిన దృశ్యాలు!

5 Nov, 2021 15:53 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ టీవీ నటుడు సిద్ధార్ద్ శుక్లా సెప్టెంబర్‌ 2న గుండెపోటు కారణంగా మృతిచెందిన విడిచిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల వయసులో సిద్థార్థ్‌ గుండె పోటుతో మరణించడం అందరనీ కలవరపెట్టింది. సాధారణంగా శారీరక శ్రమ లేకపోతే గుండెపోటు సమస్య తలెత్తుందని వైద్యులు చెబుతున్నారు. అతిగా వ్యాయాయం చేయడం వల్లనే సిద్ధార్థ్‌ గుండెపోటు బారిన పడ్డాడని వైద్యులు అభిప్రాయపడ్డారు.

సాధారణంగా ప్రతి మనిషికి 30-45 నిమిషాల వ్యాయామం చాలు. కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్న వారు గంటల తరబడి జిమ్‌కే పరిమితం అవుతారు. సిద్ధార్థ్‌ కూడా రోజు 3 గంటల పాటు వ్యాయామాలు చేసేవాడు. ఇంత అతి వ్యాయామం వద్దని డాక్టర్లు గతంలోనే సిద్ధార్థ్‌కు సూచించినప్పటికి అతడు వైద్యుల మాట వినలేదు. దీంతో ఆయన చివరకు ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు పేర్కొన్నారు.

అదేవిధంగా ఇటీవల కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండుపోటుతో మృతి చెందారు. అయితే ఆయన కూడా గంటల తరబడి జిమ్‌లో వ్యాయామాలు చేయడం వల్లనే మృతి చెందాడని కొంతమంది వైద్యులు అభిప్రాయపడ్డారు. అయితే సెలబ్రిటీలు, యువత తమ దేహాన్ని అందంగా, ఆకర్షణీయంగా మలుచుకోవటం కోసం గంటల కొద్ది సమయాన్ని జిమ్‌లో గడుపుతారు. ఆరు పలకలదేహం కోసం అన్ని రకాల కసరత్తులు చేస్తారు. కొన్నిసార్లు తమకు సాధ్యంకాని బరువులను ఎత్తుతారు.

ఈ క్రమంలో జిమ్‌ ట్రైనర్లు హెచ్చరించనప్పటకీ తాము ఫిట్‌గా ఉండాలనే కోరికతో ఇతరులతో పోటీమరీ జిమ్‌లో వర్కవుట్లు చేస్తుంటారు. అయితే మితిమీరిన జిమ్‌ వర్కవుట్లు ప్రామాదకరమని ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న ఘటనలు తెలుతున్నాయి. తాజాగా మితిమీరిన బరువులెత్తడం ప్రాణాంతమని ఓ  వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో పలువురు అధిక బరువులు ఎత్తే ప్రయత్నం చేసి.. అక్కడికక్కడే కుప్పకూలిపోతారు. ఈ వీడియోలో ఉన్నవారు శారీకంగా దృఢంగా ఉన్నప్పటికీ అధిక బరువులు ఎత్తే క్రమంలో పడిపోవటం చూసిన నెటిజన్లు జిమ్‌లో అధిక బరువులు ఎత్తటం, గంటల తరబడి వర్కవుట్లు చేయటం ప్రమాదకరమని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు