కేంద్రం చేసింది క్రూరమైన నేరం: సిసోడియా 

10 May, 2021 01:10 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను అటకెక్కించి ఇతర దేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేయడం కేంద్ర ప్రభుత్వం చేసిన క్రూరమైన నేరమంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. ఆయా వ్యాక్సిన్లను విదేశాలకు పంప కుండా ఉండి ఉంటే దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని అన్నారు. సొంత దేశంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుం టే కేంద్రం మాత్రం తమ పరపతిని పెంచుకు నేందుకు వ్యాక్సిన్లను ఎగుమతి చేసిందని మండిపడ్డారు.

కేంద్రం మొత్తం 93 దేశాలకు వ్యాక్సిన్లను పంపిందని, అందులో 60 శాతం దేశాల్లో కోవిడ్‌ నియంత్రణలో ఉందని అన్నారు. అక్కడ వారి ప్రాణాలకు ప్రమాదం లేకపోయినా, ఇక్కడి వారి ప్రాణాలను పణంగా పెట్టి పంపారన్నారు. ఈ కారణం వల్లే దేశంలో చాలా మంది యువత కరోనాకు బలయ్యారన్నారు. వ్యాక్సిన్‌ కొరత ఉన్న రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ అందిస్తామని కేంద్రం ఇప్పటికైనా హామీ ఇవ్వాలన్నారు. ఢిల్లీకి సరిపడా వ్యాక్సిన్లను అందిస్తే కేవలం మూడు నెలల్లో అందరికీ వ్యాక్సినేషన్‌ చేస్తామన్నారు. 

చదవండి: (జీఎస్‌టీ మినహాయిస్తే.. కోవిడ్‌ ఔషధాల రేట్లు పెరుగుతాయ్‌)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు