నా ఎమ్మెల్యే పదవిపై త్వరగా తేల్చండి: హేమంత్‌  

16 Sep, 2022 11:07 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్‌లో గత మూడు వారాలుగా కొనసాగుతున్న అనిశ్చితిని తొలగించాలని, తన ఎమ్మెల్యే పదవిపై స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన గురువారం గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ఎమ్మెల్యేలను కొనేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.

గనుల లీజుల వ్యవహారంలో ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ ఆరోపించింది. దీనిపై ఎన్నికల సంఘం ఈ ఏడాది ఆగస్టు 25న తన అభిప్రాయాన్ని గవర్నర్‌కు పంపించింది. హేమంత్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయడంపై   గవర్నర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.

(చదవండి: లిక్కర్‌ స్కామ్‌లో దూకుడు పెంచిన ఈడీ.. తెలంగాణలో పొలిటికల్‌ టెన్షన్‌)
 

మరిన్ని వార్తలు