యూఏఎన్ నంబర్ లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా?

20 Apr, 2021 15:55 IST|Sakshi

ఈపీఎఫ్ఓ వినియోగదారులు ఇప్పుడు యూఏఎన్ నంబర్ లేకుండానే వారి పీఎఫ్ లేదా ఈపీఎఫ్ డబ్బులను చెక్ చేసుకోనే విధంగా ఈపీఎఫ్ఓ సంస్థ కొన్ని మార్పులు చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) సభ్యులు ఇప్పుడు యూఏఎన్ నంబర్ లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

  • ముందుగా ఈపీఎఫ్ఓ ​​హోమ్ పేజీ(epfindia.gov.in)లో లాగిన్ అవ్వండి  
  • తర్వాత క్లిక్ హియర్ టూ నో యూవర్ పీఎఫ్ బ్యాలెన్స్ పై క్లిక్ చేయండి.
  • epfoservices.in.epfo పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఆ తర్వాత మీ రాష్ట్రం, ఈపీఎఫ్ సెంటర్, ఎస్టాబ్లిష్‍మెంట్ కోడ్, పీఎఫ్ అకౌంట్ నంబర్, మిగతా వివరాలను నింపండి.
  • ఇప్పడు ఐ అగ్రీ అనే బటన్ పై క్లిక్ చేయాలి.
  • మీ కంప్యూటర్ లేదా మొబైల్ లో పీఎఫ్ బ్యాలెన్స్ చూపిస్తుంది.

యూఏఎన్ నంబర్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం
ఈపీఎఫ్ఓ వినియోగదారులకు యూఏఎన్ నంబర్ ఉంటే. మెసేజ్ లేదా మిస్డ్ కాల్ సేవ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు ‘EPFOHO UAN' అని ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 వద్ద మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ లేదా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

చదవండి: మీ పేరుతో ఎవరైనా సిమ్ తీసుకున్నారో తెలుసుకోండిలా?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు