National Anthem Case: బాంబే హైకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురు!

29 Mar, 2023 14:29 IST|Sakshi

ముంబై: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. డిసెంబర్ 2021లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అగౌరవపరిచారంటూ బీజేపీ సభ్యుడు దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ మమతా బెనర్జీ దాఖలు చేసిన అప్పీల్‌ను బాంబే హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. 

ఈ ఏడాది జనవరిలో గతంతో జారీ చేసిన సమన్లను పక్కకు పెట్టి, మమతాపై మళ్లీ కొత్తగా విచారణ ప్రారంభించాలని మేజిస్ట్రేట్‌ కోర్టును సెషన్స్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో సెషన్‌ కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. తనపై నమోదైన కేసులను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై. జస్టిస్ అమిత్ బోర్కర్‌తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం స్పందిస్తూ.. మెరిట్‌లపై ఫిర్యాదును నిర్ణయించకుండా సెషన్స్ జడ్జి అనుసరించిన విధానం, విచారణకు తిరిగి మేజిస్ట్రేట్‌కు పంపడం సుప్రీంకోర్టు ఆదేశానికి అనుగుణంగా ఉంది. కావున  ప్రస్తుత కేసులో జోక్యం చేసుకోవాల్సిన అవసర లేదు’ అని పేర్కొన్నారు.

కాగా 2022లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అగౌరవపరిచినందుకు మమతాపై చర్య తీసుకోవాలని కోరుతూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముంబై యూనిట్ ఆఫీస్ బేరర్ వివేకానంద్ గుప్తా మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులో గుప్తా..మమతా బెనర్జీ 2021 మార్చిలో ముంబై పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో లేచి నిలిబడలేదని పేర్కొన్నారు. జాతీయ గీతాన్ని మమత అవమానించారని ఆయన ఆరోపించారు.  సీఎం బెనర్జీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ పోలీస్టేషన్‌ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌తో కూడిన డీవీడీని కోర్టుకు సమర్పించారు.

ఐతే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గుప్తా మెట్రోపాలిటిన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించారు. గుప్తా ఫిర్యాదును పరిగణలోనికి తీసుకున్న మెజిస్ట్రేట్‌ కోర్టు మమతాకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో జనవరి 2023లో సెషన్‌కోర్టు న్యాయమూర్తి ఆర్‌కే రోకడే మెజిస్ట్రేట్‌ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేసి,  ఫిర్యాదు మళ్లీ పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కాగా మమతా ప్రత్యేక కోర్టు సవాలు చేస్తూ.. సమన్లు రద్దు చేసి, తిరిగి విచారణకు పంపించే బదులు మొత్తం ఫిర్యాదును రద్దు చేయాల్సిందిగా  హైకోర్టుని ఆశ్రయించి పిటీషన్‌ దాఖలు చేశారు. అందుకు హైకోర్టు నిరాకరిస్తూ..పిటీషన్‌ను కొట్టేసింది. 

(చదవండి: ఆరు అంతస్తుల హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం)

>
మరిన్ని వార్తలు