ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక చుక్కలే!

19 Jan, 2021 13:16 IST|Sakshi

న్యూఢిల్లీ: మన దేశంలో ఎన్ని కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చిన కొందరు వాహనదారులు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ ఉంటారు. వీరి వల్ల ఇతర వాహనదారులు ఇబ్బందికి గురి అవుతుంటారు. అయితే ఇలా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారు ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భీమా రెగ్యులేటర్ ఐఆర్‌డిఎఐ కొత్త రూల్స్ తీసుకురాబోతుంది.(చదవండి: లండన్‌ను వెనక్కినెట్టిన బెంగళూరు)

ట్రాఫిక్‌కు ఇన్సూరెన్స్‌కు సంబంధం ఏంటని మీరు ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఒక లింకు ఉంది. ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలను తరుచూ ఉల్లంఘిస్తారో.. వారి వాహనం యొక్క భీమా ప్రీమియం కూడా పెరిగిపోతుంది. ఈ కొత్త రూల్ వల్ల మీరు ట్రాఫిక్ చలనాతో పాటు మీ వెహికల్ భీమా ప్రీమియాన్ని అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబందించిన తుది నివేదికను ఐఆర్‌డిఎఐ సిద్ధం చేసింది. తొలిసారిగా ఈ కొత్త నిబంధనలు దేశ రాజధాని ఢిల్లీలో అమలులోకి రావచ్చు. తర్వాత దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురానున్నారు. వాహన భీమా ప్రీమియం సమయంలో గత రెండేళ్ల నాటి ట్రాఫిక్ చలానాలను పరిగణలోకి తీసుకొని మీకు ప్రీమియం నిర్ణయిస్తారు.

మరిన్ని వార్తలు