‘హిజాబ్‌’ రగడ.. స్కూళ్లు తెరవండి: హైకోర్టు

10 Feb, 2022 18:16 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్‌– కండువా వివాదం కారణంగా విద్యా సంస్థల మూసివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యాసంస్థలు తెరవాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  అదే సమయంలో తుది తీర్పు వచ్చే వరకూ విద్యార్థులు హిజాబ్‌-కండువాల ప్రస్తావన తేవొద్దని తెలిపింది. 

హిజాబ్‌ రగడపై దాఖలైన పిటిషన్‌ను సీజే జస్టిస్‌ రితురాజ్‌ అవస్థీ నేతృత్వంలోని హైకోర్టు విచారించింది.  గురువారం విచారించిన ధర్మాసనం..  తుది తీర్పును ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకూ హిజాబ్‌- కండువాల ప్రస్తావనకు దూరంగా ఉండాలని పేర్కొంది.  కాగా, వివాదంపై మంగళ, బుధవారాల్లో హైకోర్టులో జరిగిన విచారణలో పరీక్షలు రెండు నెలలే ఉన్నందున ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు