హిమాచల్‌లో హోరాహోరీ.. ‘ఆపరేషన్‌ లోటస్‌’ గుబులు.. కొత్త ఎమ్మెల్యేల తరలింపు!

8 Dec, 2022 10:29 IST|Sakshi

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శాసనసభ ఫలితాల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య హోరోహోరీ పోటీ నెలకొంది. స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న హస్తం పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలు పెట్టింది. బీజేపీ ఆపరేషన్‌ కమలం ప్రయత్నాలను అడ్డుకుని, విజయం సాధించే తమ అభ్యర‍్థులను చేజారి పోకుండా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

రాష్ట్రంలోని పరిస్థితులపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రానికి ఆమె సిమ్లా చేరుకోనున్నారని సమాచారం. మరోవైపు.. కొత్త ఎమ్మెల్యేల తరలింపు బాధ్యతను ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భఘేల్‌, పార్టీ సీనియర్‌ నేత భూపిందర్‌ సింగ్‌ హుడాకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గురువారం సాయంత్రం ఎమ్మెల్యేలను బస్సుల ద్వారా రాజస్థాన్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.

ఇదీ చదవండి: మోదీ అడ్డాగా గుజరాత్‌.. రికార్డులు బద్దలుకొట్టిన బీజేపీ!

మరిన్ని వార్తలు