School Bus Accident-Himachal Pradesh: లోయలో పడ్డ స్కూల్‌ బస్సు.. 16 మంది మృతి

4 Jul, 2022 10:53 IST|Sakshi

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విద్యార్థులు, ప్రయాణికులతో వెళ్తున్న స్కూల్‌ బస్సు అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పాఠశాల విద్యార్థులు, కొందరు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కులు జిల్లా డిప్యూటీ కమిషనర్‌ అశుతోష్‌ గార్గ్‌ చెప్పారు. 

సయింజ్‌ వైపునకు వెళ్తున్న బస్సు ఉదయం 8.30 ప్రాంతంలో జంగ్లా గ్రామం వద్ద ప్రమాదానికి గురైందని తెలిపారు. జిల్లా అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్టు గార్గ్‌ వెల్లడించారు.
పాకిస్తాన్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి
కరెంట్‌ బిల్లు కట్టలేదని మెసేజ్‌.. తీరా ఓపెన్‌ చేసి చూస్తే..

మరిన్ని వార్తలు