హిమాలయాలకు భారీ భూకంప ముప్పు

24 Oct, 2020 04:32 IST|Sakshi

మన తరంలోనే వచ్చే అవకాశం

న్యూఢిల్లీ: భారతదేశానికి పెట్టని కోటలా ఉన్న హిమాలయాలకు భారీ భూకంపాల ముప్పు ఉందని తాజా అధ్యయనం తేల్చింది. హిమాలయాల శ్రేణిలో రిక్టర్‌ స్కేలుపై 8 కంటే తీవ్రత ఉండే భూకంపాలు సంభవిస్తాయని చెప్పింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌–కోల్‌కతా, అమెరికాకు చెందిన నెవడా యూనివర్సిటీ నిపుణుతో కూడిన బృందం ఈ విషయాలను వెల్లడించింది. ‘అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి పాకిస్తాన్‌ సరిహద్దుల వరకూ వ్యాపించి ఉన్న హిమాలయాల శ్రేణిలో గతంలోనూ భారీ భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది. మా పరిశోధనలో తేలిన ప్రకారం మన తరంలోనే రాబోయే భారీ భూకంపాన్ని చూసే అవకాశం ఉంది. ఎంత లేదన్నా 100 సంవత్సరాల్లోపే పెద్ద భూకంపం సంభవించే అవకాశం ఉంది’ అని పరిశోధనలో పాల్గొన్న జియాలజీ, సిస్మోలజీ నిపుణుడు వెస్నౌస్కీ చెప్పారు.

మరిన్ని వార్తలు