గాడ్సే ఫొటోలతో తిరంగా యాత్ర.. హిందూ మహాసభ నిర్వాకం

17 Aug, 2022 07:32 IST|Sakshi

ముజఫర్‌నగర్‌: పంద్రాగస్టు సందర్భంగా సోమవారం అఖిల భారతీయ హిందూ మహాసభ చేపట్టిన తిరంగా యాత్రలో నాథూరాం గాడ్సే ఫొటోలను ప్రదర్శించడం కలకలం రేపుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై పలు సంఘాల నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, దీన్ని సంస్థ జాతీయాధ్యక్షుడు యోగేంద్ర వర్మ సమర్థించుకోవడం విశేషం.

‘‘ స్వాతంత్య్ర దినోత‍్సవం సందర్భంగా మేము తిరంగా యాత్ర చేపట్టాం. జిల్లా మొత్తం ఈ యాత్ర కొనసాగింది. ఇందులో ప్రముఖ హిందూ నేతలంతా పాల్గొన్నారు. మేము పలువురు స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలు పెట్టాం. తిరంగా యాత్రలో మా కార్యకర్తలు ప్రదర్శించిన సమర యోధుల ఫొటోల్లో గాడ్సే కూడా ఉన్నారు. గాంధీ జాతి వ్యతిరేక విధానాలపై గాడ్సే గళం విప్పారన్నది మా విశ్వాసం’’ అని చెప్పుకొచ్చారు యోగేంద్ర వర్మ.

ఇదీ చదవండి: కర్ణాటక సీఎం బొమ్మైకి మరో తలనొప్పి.. రాష్ట్ర మంత్రి ఆడియో లీక్‌!

మరిన్ని వార్తలు