పెద్దలు వద్దన్నా పెళ్లి చేసుకున్నాడు.. భార్య బెదిరింపుతో ‘బీఫ్‌’ తిని చివరకు..

29 Aug, 2022 21:24 IST|Sakshi

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగానే ఉన్నారు. కానీ, భార్య, బావమరిది చేసిన పనికి మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు వారే కారణమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషాద ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. సూరత్‌కు చెందిన రోహిత్ ప్రతాప్ సింగ్, ముస్లిం మహిళ సోనమ్ కలిసి ఒకేచోట పనిచేశారు. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. రోహిత్‌ హిందూ, సోనమ్‌ ముస్లిం కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. కానీ.. రోహిత్‌ మాత్రం ప్రేమించిన సోనమ్‌ను వదులుకోలేక వివాహం చేసుకున్నాడు. రోహిత్‌ వీరి వివాహ బంధం కొద్దిరోజులు సాఫీగానే సాగింది. 

ఇంతలో, అనుకోకుండా.. ఈ ఏడాది జూన్‌లో రోహిత్‌ను బీఫ్‌ తినాలని భార్య సోనమ్‌, ఆమె సోదరుడు అఖ్తర్‌ అలీ ఫోర్స్‌ చేశారు. దీంతో, ఇష్టం లేకపోయినా రోహిత్‌.. బీఫ్‌ తిన్నాడు. అనంతరం, దీనిని తట్టుకోలేని రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, రోహిత్ తన సూసైడ్‌కు ముందు‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన సూసైడ్‌ నోట్‌ ఇటీవల బయటపడింది. తన సూసైడ్‌ నోట్‌లో రోహిత్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నేను.. నా భార్య, ఆమె సోదరుడి కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను. నన్ను చంపేస్తానని బెదిరించి నాతో వాళ్లు బీఫ్ తినిపించారు. ఈ లోకంలో జీవించే అర్హత నాకు లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకు న్యాయం చేయండి అని సూసైడ్ నోట్ రాసుకొచ్చాడు. అయితే, రోహిత్‌ ఫేస్‌బుక్‌ నోట్‌ అతడి ఫ్రెండ్స్‌ కంటపడటంతో ఈ విషయాన్ని అతడి తల్లి వీణా దేవికి చెప్పారు. ఈ క్రమంలో తన కొడుకు చావుకు భార్య సోనమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నోట్‌ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు