-

ఉగ్రవాది ఇంటిగోడ బుల్‌డోజర్‌తో కూల్చివేత.. వీడియో వైరల్..

31 Dec, 2022 13:05 IST|Sakshi

శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది అక్రమంగా నిర్మించిన ఇంటిగోడను జమ్ముకశ్మీర్ అధికారులు కూల్చివేశారు. జేసీబీతో ప్రహరీని నేలమట్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కశ్మీర్ అనంతనాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదిని గులాం నబీ ఖాన్‌గా గుర్తించారు. ఈ ప్రహరీని గోడను అక్రమంగా నిర్మించాడని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమమించుకున్నాడని అధికారులు చెప్పారు. అందుకే చర్యలు చేపట్టి గోడను కూల్చివేసినట్లు వివరించారు. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

చదవండి: డ్రైవర్‌కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం

మరిన్ని వార్తలు