కశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు.. అమిత్‌షా ఉన్నతస్థాయి సమావేశం

3 Jun, 2022 17:36 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో హిందువులపై జరుగుతున్న వరుస హత్యల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అమిత్‌ షా అధ్యక్షతన శుక్రవారం ఉన్నతస్థాయి భద్రతా సమావేశం జరిగింది. ఈ  సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, జమ్ము కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్, ఆర్‌ అండ్‌ ఏడబ్ల్యూ చీఫ్‌ సమంత్‌ సమంత్‌ గోయల్‌ హాజరయ్యారు. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు, పౌరుల భద్రత, ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు అమలు చేసే వ్యూహాలపై సమీక్షించారు.

కాగా జ‌మ్మూకశ్మీర్‌లో మ‌ళ్లీ ఉగ్ర‌ కార్య‌క‌లాపాలు క్ర‌మంగా పెరుగుతున్న ప‌రిస్థితులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో గత కొన్ని నెలలుగా హిందువులను లక్ష్యంగా చేసుకొని వరుస హత్యలు జరగుతున్నాయి. మే 1 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది లక్షిత హత్యలు జరిగాయి. గురువారం బీహార్‌కు చెందిన దిల్‌ఖుష్‌ కుమార్‌ (17) అనే కార్మికుడు బుద్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. అదే రోజు కుల్గామ్‌లో రాజస్థాన్‌కు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి హత్యకు గురయ్యాడు. అంతకు ముందు గోపాల్‌పొర ప్రాంతంలోని ఓ పాఠశాలలో చొరబడిన ఉగ్రవాదులు అక్కడ పనిచేస్తోన్న రజిని బాలా అనే ఉపాధ్యాయురాలిని కాల్చి చంపారు. 

అయితే ఇటీవల జరిగిన దాడులను నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళనలను నిర్వహిస్తున్నారు. కశ్మీర్‌ నుంచి వారిని జమ్మూకు బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. గత నెలలో కాశ్మీర్ లోయలోని 350 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, కాశ్మీరీ పండిట్లందరూ మనోజ్ సిన్హాకు రాజీనామాలు సమర్పించారు.  
చదవండి: ఆర్యసమాజ్‌లో వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మరిన్ని వార్తలు