అయ్యో గుర్రానికి ఎంత కష్టం వచ్చింది.. వీడియో చూసి చలించిపోతున్న నెటిజన్లు!

13 Sep, 2022 13:44 IST|Sakshi

తల్లి ప్రేమ గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలే తన జీవితంగా బతుకుతుంది అమ్మ.. అమ్మ ప్రేమ అనేది కేవలం మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ కనిపిస్తుంది.. ఇలాంటి ఘటనలు ఇది వరకే ఎన్నో చూసి ఉంటాము. కాగా, ఇటువంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. ఓ గుర్రానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. 

వివరాల ప్రకారం.. తమిళనాడులో కోయంబత్తూరులోని పట్టీశ్వర దేవాలయం సమీపంలోని దర్పణం మండపం, పడితుర ప్రాంతాల్లో 10కి పైగా గుర్రాలు తిరుగుతున్నాయి. ఆ ప్రాంతంలోనే పచ్చి గడ్డి మేస్తూ ఉంటున్నాయి. కాగా, వారం క్రితం ఓ పిల్ల గుర్రం మందలోని నుంచి తప్పిపోయింది. అది తల్లి గుర్రాన్ని వెతుక్కుంటూ ఆ ప్రాంతమంతా తిరిగింది. 

ఇదే సందర్భంలో ఓ బస్సుపై ఉన్న గుర్రపు బొమ్మను చూసింది. దీంతో, ఆ బొమ్మే తన తల్లి అనుకుంది. కాసేపు అక్కడే అటు ఇటూ తిరిగింది. ఇంతలో బస్సు స్టార్ట్‌ కావడంతో తన తల్లి పరిగెత్తుతుందనే భావనతో పిల్ల గుర్రం కూడా బస్సు వెంట పరుగు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, గుర్రాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా కంటతడి పెట్టించింది. వారంతా ఆవేదనకు లోనయ్యారు. 

మరిన్ని వార్తలు