మీ ఆధార్ ని ఎవరైనా చూశారో లేదో తెలుసుకోండిలా..?

7 Mar, 2021 19:40 IST|Sakshi

ప్రస్తుతం ప్రతి చిన్న పనికి కూడా ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నాము. బ్యాంక్ ఖాతా తీసుకోవాలన్న, ప్రభుత్వ పథకాలు పొందలన్న, ఇలా ఏవైనా ఇతరత్ర పని కోసం ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరి. అందుకే ప్రభుత్వం కూడా ఆధార్ కార్డును జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రజలను కోరుతుంది. ముక్కు మొహం తెలియని అపరిచిత వ్యక్తుల చేతుల్లోకి మన ఆధార్ వివరాలు వెళ్తే ఇక అంతే సంగతులు. అందుకే మన ఆధార్ ను ఎవరైనా ఎక్కడైనా ఉపయోగించారో లేదో తెలుసుకొనే అవకాశాన్ని యూఐడీఏఐ మనకు కల్పిస్తుంది. అది ఎలా తెలుసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా ఆధార్ అధికారిక యూఐడీఏఐ https://uidai.gov.in/ వెబ్ సైటు ఓపెన్ చేయాలి
  • మై ఆధార్ సెక్షన్ లోకి వెళ్లి ఆధార్ సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి
  • ఆనంతరం ఆధార్ సర్విస్ సెక్షన్ లో 8వ వరుసలో కనిపించే ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయాలి
  • ఇప్పుడు ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి
  • ఎప్పటి నుంచి ఆధార్ హిస్టరీ కావాలో ఎంచుకొని, తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి
  • ఇప్పుడు మీకు మీరు ఏ సమయంలో, ఎక్కడ ఆధార్ ఉపయోగించారో వివరాలు కనిపిస్తాయి
  • ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే కచ్చితంగా మీ మొబైల్ నెంబర్, ఆధార్ కు లింకు చేయాల్సి ఉంటుంది 

చదవండి:

ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయండి ఇలా! 

తొలి ట్వీట్‌ ఖరీదు రూ.18.30 కోట్లు!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు