2నిముషాల్లో ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి!

28 Feb, 2021 17:52 IST|Sakshi

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు ప్రతీ చోటా అవసరం అవుతోంది. మరి ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఆధార్ తప్పనిసరి అవసరం అవుతోంది. ఇక సిమ్ కార్డులు తీసుకోవడానికి, బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డును తప్పనిసరి అందజేయాల్సిందే. కానీ ప్రతిసారి ఆధార్ కార్డును ఎప్పుడూ మన వెంట తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఎప్పుడైనా అత్యవసర సమయంలో మీ దగ్గర ఆధార్ కార్డు లేకుంటే ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైనా మీ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం యూఐడీఏఐ కల్పించింది. మీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఆధార్ డౌన్‌లోడ్ 2నిమిషాలలో చేసుకోవచ్చు. 

ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే విధానం:

  • ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ యూఐడీఏఐలో రిజిస్టరై ఉండాలి. 
  • మీ స్మార్ట్‌ఫోన్‌లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. 
  • మీ దగ్గర ఆధార్ నెంబర్, ఎన్ రోల్ మెంట్ నెంబర్, వర్చ్యువల్ ఐడి ఉంటే ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
  • మై ఆధార్ ఆప్షన్ క్లిక్ చేసి డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. 
  • ఆధార్ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి. 
  • క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత Send OTP క్లిక్ చేయాలి. 
  • మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. 
  • ఇ-ఆధార్ కాపీ మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. 
  • డౌన్‌లోడ్ అయిన ఇ-ఆధార్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. 
  • మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్స్ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.

చదవండి:

మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు

మరిన్ని వార్తలు