కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో పాస్‌పోర్ట్‌ వివరాలను సమర్పించడం ఎలా?

25 Jun, 2021 18:14 IST|Sakshi

మీరు విదేశాలకు ప్రయాణిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కోవిన్ పోర్టల్ ద్వారా పాస్ పోర్ట్ వివరాలను కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో నమోదు చేయవచ్చు. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో తమ పాస్ పోర్ట్ నెంబరును నమోదు చేయడానికి కోవిన్ వినియోగదారులకు కేంద్రం అవకాశం కల్పిస్తుంది. మీరు ఆన్ లైన్ లోనే ఇంట్లో నుంచే వివరాలను నమోదు చేయవచ్చు. కోవిన్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ విదేశాలకు ప్రయాణిస్తున్న సమయంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. "ఇప్పుడు మీరు మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో మీ పాస్ పోర్ట్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవచ్చు" అని ఆరోగ్య సేతు యాప్ అధికారిక హ్యాండిల్ ట్వీట్ చేసింది.

ఈ నెల ప్రారంభంలో విద్య, ఉద్యోగాలు, టోక్యో ఒలింపిక్ క్రీడల కోసం భారత బృందం విదేశాలకు ప్రయాణించేటప్పుడు వారు తమ పాస్ పోర్ట్ తో లింకు అయిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను కలిగి ఉండాల్సి ఉంటుందని పేర్కొంటూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వినియోగదారులు తమ పాస్ పోర్ట్ వివరాలను కోవిన్ వెబ్ సైట్ (cowin.gov.in) ద్వారా జోడించవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో పాస్ పోర్ట్ వివరాలను ఎలా సమర్పించాలి?

  • కోవిన్ అధికారిక పోర్టల్(cowin.gov.in) లాగిన్ అవ్వండి.
  • "Raise a Issue" అనే ఆప్షన్ ఎంచుకోండి.
  • ఇప్పుడు "పాస్ పోర్ట్" ఆప్షన్ నొక్కి డ్రాప్ డౌన్ మెనూలో 'Person'ని ఎంచుకోండి.
  • మీ పాస్ పోర్ట్ నెంబరును నమోదు చేసి వివరాలను సమర్పించండి.
  • ఇప్పుడు మీరు కొత్త సర్టిఫికేట్ ని సెకండ్లలో పొందుతారు.

ఒకవేళ వ్యాక్సిన్ సర్టిఫికేట్ పేరు పాస్ పోర్ట్ పై ఉన్న పేరు సరిపోలకపోతే మీరు పేరును ఎడిట్ చేసుకోవచ్చు. 

  • కోవిన్ అధికారిక పోర్టల్(cowin.gov.in) లాగిన్ అవ్వండి.
  • ఇప్పుడు 'Raise an issue' ఆప్షన్ క్లిక్ చేసి సభ్యుడి పేరును ఎంచుకోండి.
  • 'కరెక్షన్ ఇన్ సర్టిఫికేట్' అనే ఆప్షన్ మీద తట్టండి.
  • మీరు ఏమి కరెక్షన్ కాయలని అనుకుంటున్నారో ఆ ఆప్షన్ ఎంచుకోండి.
  • ఇప్పుడు సరైన వివరాలను నమోదు చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
  • మీ వ్యక్తిగత వివరాలను ఒక్కసారి మాత్రమే సవరించగలరు అనే విషయం దయచేసి గుర్తుంచుకోండి. 

చదవండి:  ట్విటర్‌ ఖాతా బ్లాక్... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం

>
మరిన్ని వార్తలు