చిన్న ఎస్ఎంఎస్‌తో ఆధార్ డేటాను రక్షించుకోండి

7 Jun, 2021 15:13 IST|Sakshi

ప్రస్తుతం మన దేశంలో 5 ఏళ్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డును కలిగి ఉండటం తప్పనిసరి. ఇది ఒక ఐడీ ప్రూఫ్ లాగా మాత్రమే కాకుండా, చిరునామా గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడుతుంది. విద్య, ఉద్యోగ, ప్రభుత్వ పథకాల కోసం ఈ కార్డు తీసుకోవడం తప్పనిసరి. అందుకే మన దేశంలో ఈ కార్డుకు ఉన్న మరే ఇతర కార్డుకు లేదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆధార్ నెంబర్ ఇతరులకు తెలిస్తే మీ వివరాలు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారు అసాంఘిక శక్తుల కోసం మీ నెంబర్ కోసం ఉపయోగిస్తే మీరు పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.

అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవసీ, సెక్యూరిటీ వంటి ఫీచర్స్‌ని అందిస్తోంది. మీ ఆధార్ కార్డు ఎక్కడైనా పోతే మీరు వెంటనే మీ ఆధార్ నెంబర్‌ను లాక్ చేయొచ్చు. దీని ద్వారా ఎవరైనా మీ ఆధార్ నెంబర్‌ను ఎవరు ఉపయోగించలేరు. అలాగే లాక్ చేసిన ఆధార్‌ను ఆన్-లాక్ కూడా చేయవచ్చు. వీటి కోసం మీరు ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ సహయంతో సులభంగా లాక్ చేయవచ్చు. మొదట మీరు మీ మొబైల్ నెంబర్ నుంచి GETOTPAadhaar NUMBER-last-4-digits టైపు చేసి 1947కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది.

అలాగే, తర్వాత మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని LOCKUIDAadhaar NUMBER-last 4-digitsOTP-6-digits అని టైపు చేసి మళ్లీ 1947కి మెసేజ్ చేస్తే మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. ఉదాహరణకు ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు 9123 అనుకుంటే GETOTP 9123 అని టైప్ చేయాల్సి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీ 012345 అనుకుంటే LOCKUID 9123 012345 ఈ ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే చాలు. మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. ఇక మీ ఆధార్ నెంబర్‌ను ఆథెంటికేషన్ కోసం ఎవరూ వాడలేరు. అలాగే, ఆన్-లాక్ చేయాలంటే వర్చువల్ ఐడీ సహాయంతో చేయవచ్చు.

చదవండి: కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

మరిన్ని వార్తలు