ఐపీపీబి ద్వారా పోస్టాఫీస్‌లో ఖాతా తెరవండి

14 Feb, 2021 20:53 IST|Sakshi

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎప్పటికపుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. గతంలో కేవలం ఉత్తరాల పంపిణీకి మాత్రమే పరిమితమైన పోస్ట్ ఆఫీస్ కొత్తగా బ్యాంకింగ్ సేవలను తీసుకొచ్చినప్పటి నుంచి తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఇండియన్ పోస్టల్ బ్యాంకు మరో కొత్త సాంకేతికతను కొత్త యూజర్లకు అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబి) తన మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్‌ పొదుపు ఖాతాలను తెరిచే సౌకర్యాన్ని కొత్త యూజర్లకు అందిస్తుంది. గతంలో పోస్టాఫీస్‌లో ఖాతా తెరవడానికి కూడా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లకుండానే ఐపీపీబి యాప్  ద్వారానే ఇంట్లో నుంచే ఖాతా తెరవవచ్చు. అలాగే ఈ యాప్ ద్వారా బ్యాలెన్స్ చెకింగ్, డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడంతో పాటు ఇతర లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. 

ఐపీపీబిలో పోస్టాఫీస్ ఖాతా తెరిచే విధానం:
1) దరఖాస్తుదారుడు 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరుడు అయి ఉండాలి.
2) మీ మొబైల్ ఫోన్‌లోని ఐపిపిబి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌కు వెళ్లి 'ఓపెన్ అకౌంట్' పై క్లిక్ చేయండి.
3) ఇప్పుడు మీ పాన్ కార్డు నంబర్, ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయాలి.
4) ఆధార్ కార్డు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. 
5) విద్యా అర్హతలు, చిరునామా, నామినీ వివరాలు వంటి వ్యక్తిగత వివరాలు సమర్పించాలి.
6) అన్ని వివరాలు సమర్పించిన తర్వాత డిజిటల్‌ ఖాతా తెరవబడుతుంది. 

ఈ డిజిటల్ పొదుపు ఖాతా ఒక సంవత్సరానికి మాత్రమే చెల్లుతుంది. ఖాతా తెరిచిన ఒక సంవత్సరంలో మీరు దగ్గరలో ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత అది సాధారణ పొదుపు ఖాతాగా మార్చబడుతుంది.

చదవండి:

10కోట్లకు పైగా అమ్ముడైన ఆపిల్‌ వాచ్‌లు

ఎంఆధార్ వినియోగదారులకు తీపికబురు


 

మరిన్ని వార్తలు