పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయ‌డం ఎలా..?

13 Jun, 2021 16:46 IST|Sakshi

 చివ‌రి తేదీ జూన్ 30

పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించేందుకు చివ‌రి తేదీ జూన్ 30. గతంలో మార్చి 31 వరకు ఉన్న గడువును ఈ నెల చివరి వరకు కరోనా మహమ్మారి కారణంగా పొడగించింది. ఇంకో సారి ఈ గడువును పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేల ఈ గ‌డువు లోపు లింక్ చేయ‌క‌పోతే రూ.1000 ఆల‌స్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్‌ను ప్రవేశపెట్టింది. ఇంత‌వ‌ర‌కు పాన్‌- ఆధార్‌‌ లింక్ చేయ‌ని వారు ఈ నెలాఖ‌రు లోపు లింక్ చేయ‌డం మంచిది. పాన్ కార్డుతో, ఆధార్‌ను ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పాన్ కార్డును ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి?

  • మొదట https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్ సైట్ ఓపెన్ చేయండి. 

  • ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి, పోర్టల్ హోమ్‌పేజీలోని 'లింక్ ఆధార్' ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
  • తర్వాత మరో క్రొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. 
  • మీకు కనిపించే బాక్స్ లలో పాన్, ఆధార్ నంబర్, పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి. 

  • ఒప్పందం అవసరమైన పెట్టెలను గుర్తించి, లింక్ ఆధార్‌పై క్లిక్ చేయండి
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఆరు-అంకెల ఓటీపీ ఎంటర్ చేస్తే లింకింగ్ ప్రాసెస్‌ను ధృవీకరించండి.

చదవండి: 10 నిమిషాల యాత్ర కోసం రూ.205 కోట్లు ఖర్చు

మరిన్ని వార్తలు