‘అన్న అంత్యక్రియల కోసం వచ్చిన నన్ను చూసి అందరు ఏడ్చారు’

26 Jun, 2021 13:11 IST|Sakshi

ఎమర్జెన్సీ రోజులు గుర్తుచేసుకున్న హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ 

సాక్షి, న్యూఢిల్లీ: ఆత్యయిక స్థితి సమయంలో జైలు నుంచి వచ్చి అన్న అంత్యక్రియల్లో పాల్గొన్న తనను చూసి అందరూ చలించిపోయారని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. 1975 జూన్‌ 25న అమలులోకి వచ్చిన ఆత్యయిక స్థితి నాటి రోజులు, పడిన కష్టాలు దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. ఆత్యయిక స్థితి అమలులోకి వచ్చిన రోజును ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన రోజుగా ఆయన అభివర్ణించారు. 

                                                       మన దత్తన్నే.. మారు వేషంలో

‘‘ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో సంఘ్‌ ప్రచారక్‌గా పనిచేస్తున్నా. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించడంతో పలువురితో కలసి రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. మారువేషాల్లో జయప్రకాశ్‌ నారాయణ నాయకత్వంలోని సంఘర్షణ సమితికి పనిచేసే వాళ్లం. తొమ్మిది నెలల తర్వాత నేటి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు మీసా చట్టం కింద అరెస్టు చేశారు. జైలులో ఉన్న సమయంలోనే అన్న అనారోగ్యంతో మరణించారు. అంత్యక్రియల కోసం పెరోల్‌పై బయటకు వచ్చాను. పోలీసుల రక్షణ వలయంలో వ్యాన్‌ నుంచి దిగిన నన్ను చూసి బంధువులు, చుట్టుపక్కల వాళ్లు చలించిపోయారు’’ అని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.   

చదవండి: మంచుకొండల్లో ఎంజాయ్‌ చేసిన గవర్నర్‌

మరిన్ని వార్తలు