విద్యా మంత్రిత్వ శాఖగా మారిన హెచ్‌ఆర్డీ

29 Jul, 2020 13:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్‌ఆర్డీ) శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చే ప్రతిపాదనను బుధవారం కేంద్ర కేబినెట్ఆమోదించింది. ఇస్రో మాజీ చీఫ్‌ కే కస్తూరిరంగన్‌ సారథ్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ తొలుత మంత్రిత్వ శాఖ పేరు మార్చాలని సిఫార్సు చేసింది. నూతన విద్యా విధానం డ్రాఫ్ట్‌లో ఇది కీలక సిఫార్సు కావడంతో పేరు మార్పునకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. విద్య, బోధన, సాధన ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించే దిశగా హెచ్‌ఆర్డీ శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా మార్చాలని ఈ కమిటీ సూచించింది. జాతీయ విద్యా విధానానికీ కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చదవండి : సినిమాలు, జిమ్స్ తెరవొచ్చు!

మరిన్ని వార్తలు