టీఎంసీ మంత్రి సన్నిహితుల ఇంట్లో కుప్పలుకుప్పలుగా నోట్ల కట్టలు

22 Jul, 2022 21:34 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‍సీ) కుంభకోణానికి సంబంధించి కోల్‌కతాలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఈ కేసుతో సంబంధం ఉన్న మంత్రి పార్థ చటర్జీ, ఆయన సన్నిహితుల నివాసాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో మంత్రి సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో కుప్పలుకుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అన్నీ రూ.2000, 500 నోట్ల కట్టలే ఉన్నాయి. వీటి మొత్తం రూ.20 కోట్లు అయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు అధికారులను పిలిచించి క్యాష్ కౌంటింగ్ మిషన్లతో లెక్కిస్తున్నారు. 

రూ.20 కోట్లకు సంబంధించి అర్పిత వద్ద సరైన లెక్కలు లేవని అధికారులు పేర్కొన్నారు. డబ్బుతో పాటు 20 మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇవన్నీ ఎస్‌ఎస్‌సీ కుంభకోణానికి సంబంధిచినవే అయి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగాల్ విద్యాశాఖ సహాయమంత్రి పరేశ్ అధికారికి నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఎస్‌ఎస్‌సీ కుంభకోణానికి సంబంధించి మంత్రులు పార్థ చటర్జీ, పరేశ్ అధికారిలను సీబీఐ ఇప్పటికే గంటలపాటు ప్రశ్నించింది.
చదవండి: యే క్యా హై మోదీజీ.. వాళ్లకోసం ఏమైనా చేస్తారు.. సీనియర్ సిటిజెన్లకు రాయితీ ఇ‍వ్వలేరా?

>
మరిన్ని వార్తలు