రాళ్లు రువ్వి దాడికి యత్నం..పోలీసులనే పరుగులు తీయించారు

4 Feb, 2023 11:46 IST|Sakshi

ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందంటూ వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో వాటిని తొలగించేందకు పోలీసులు, జిల్లా అధికారులు వచ్చారు. ఐతే వారు ఆక్రమణలు తొలగించి పనిపూర్తి చేసుకుని వెళ్లిపోతుండగా.. ఒక గుంపు దాడికి తెగబడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని జితార్‌ ఖేడి గ్రామంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి.

వాటిని తొలగించేందుకు సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ సంజయ్‌ సాహు నేతృత్వంలోని పోలీసులు బృందం గ్రామానికి వచ్చారు. అక్కడ ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించి వెళ్లిపోతుండగా అకస్మాత్తుగా ఒక గుంపు వచ్చి పోలీసులుపై రాళ్లు రువ్వి.. దాడికి తెగబడ్డారు. ఆ గుంపులో మహిళలు, పిల్లలు తోసహా అధికారులపై దాడికి యత్నించారు. ఈ ఘటనలో బుల్డోజర్లు, కార్లు ధ్వసం అయ్యాయి. ఈ దాడి నుంచి మేజిస్ట్రేట్‌ సాహును రక్షించేందుకు మరో పోలీసుల వాహనంలో తరలించినట్లు అధికారులు తెలిపారు.

వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సమీపంలోని జితార్ ఖేడీ గ్రామంలోని అర బిఘా (6,000 చదరపు అడుగులు) ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు సాహు పేర్కొన్నారు. ఇంతకుమునుపు గతంలో ఈ భూమిలో అన్ని వర్గాల వారు కార్యక్రమాలు నిర్వహించేవారని, ఐతే ఆక్రమణలకు గురికావడంతో అన్నీ ఆగిపోయాయని గ్రామస్తులు చెబుతున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదు మేరకు సాహు నేతృత్వంలోని పోలీసుల బృందం ఆక్రమణలు తొలగించేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం.

ఆక్రమణలు తొలగించి పని పూర్తి చేసి వెళ్తుండగా దాడికి పాల్పడ్డారని పోలీసుల చెబుతున్నారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది తోసహా బుల్డోజర్‌ డ్రైవర్‌ కూడా గాయపడినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చట్టాన్ని ఉల్లంఘి ఈ ఘటనకు పాల్పడిన వారందరికీ శిక్ష పడుతుందని అదనపు మెజిస్ట్రేట్‌ సంతోష్‌ ఠాగూర్‌ తెలిపారు​.

(చదవండి: ఆరు నెలల క్రితం అదృశ్యం! చివరికి అస్థిపంజరంగా ఆచూకీ లభ్యం)

మరిన్ని వార్తలు