10 అడుగుల పైథాన్‌తో యువకుల పోరు..!

26 Sep, 2023 16:44 IST|Sakshi

ముంబయి: మహారాష్ట్రాలోని థాణె జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 10 అడుగుల పైథాన్ ఓ ఇంటి బెడ్‌రూంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది. అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో కిటికి గుండా ఏకంగా బెడ్‌రూంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇద్దరు యువకులు పైథాన్‌తో ఫైట్ చేసి చివరికి దానిని కిటికీ నుంచి కిందికి పడేశారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంత పెద్ద పైథాన్‌ ఏకంగా బెడ్‌రూంలోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

ఇదీ చదవండి: బుల్లెట్ నడిపిన సీఎం ఖట్టర్

మరిన్ని వార్తలు