షాపింగ్ తంటా : ప్రముఖ షోరూం మూత

21 Oct, 2020 10:14 IST|Sakshi

 షాపింగ్ కోసం  ఎగబడిన జనం

వైరల్  అయిన వీడియో

షోరూంకు తాళం వేసిన జీసీసీ

సాక్షి, చెన్నై: పండుగ సీజన్ రావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో షాపింగ్ సందడి నెలకొంది.  ముఖ్యంగా కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షలతో గత ఏడు నెలలుగా ఇంటికి పరిమితమైన ప్రజలు షాపింగ్ కోసం భారీ సంఖ్యలో షోరూంలకు క్యూ కడుతున్నారు. ఇదే చెన్నైలోని ఒక దిగ్గజ బట్టల దుకాణానికి షాక్ ఇచ్చింది. కోవిడ్-19 నిబంధనలను భారీగా ఉల్లంఘించారని ఆరోపిస్తూ చెన్నైలోని ప్రసిద్ధ కుమరన్ సిల్క్స్‌ను మంగళవారం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జిసిసి) మూసివేసింది.  దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. (ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్)

షోరూమ్ లోపల,  వెలుపల ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా, ఫేస్ మాస్క్‌లు ధరించకుండా వందలాది మంది జనం గుమిగూడిన నేపథ్యంలో దానికి సీల్ వేశామని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. ప్రజలు భద్రతా ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని జీసీసీ ఒక ట్వీట్‌లో పేర్కొంది.  నిబంధనలు ఉల్లంఘించడం చాలా ప్రమాదకరం, బాధాకరమని జీసీసీ కమిషనర్ జీ ప్రకాష్ వ్యాఖ్యానించారు. ఒకేసారి 500 లేదా వెయ్యి మంది కస్టమర్లను అనుమతించమని, వీరిని దుకాణాదారులే నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈ ఉల్లంఘనలు ప్రతి దుకాణంలో జరుగుతున్నాయి... ఈ ఒక్కదాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.  ఇది పండుగ కాలం కనుక షాపింగ్ చేయాలనుకుంటున్నారని గీతా పద్మనాభన్ ఆగ్రహం వ్యక్తం చేయడం  విశేషం. 

మరిన్ని వార్తలు